టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నిమ్మకూరు పర్యటన వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో బాలయ్య గురువారం పర్యటించారు. ఎన్టీఆర్ స్వగ్రామానికి వచ్చిన బాలయ్యను కలిసేందుకు చుట్టుపక్కల గ్రామాల వాసులు తరలివచ్చారు.
ఈ క్రమంలో బాలయ్య తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు వాసులపై బాలయ్య నోరుపారేసుకున్నారు. బాలకృష్ణతో ఫొటోలు దిగేందుకు వచ్చిన కొరమవోలు గ్రామస్తులు తమ గ్రామాన్ని పట్టించుకోండి అంటూ బాలకృష్ణను కోరారు. పట్టించుకోను.. నాకేం పనిలేదు అనుకుంటున్నారా.. ఫొటోలు దిగారుకు వెళ్లిపోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. కొమరవోలు గ్రామమా అదెక్కడా..? కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అని బాలకృష్ణ అని దురుసుగా ప్రవర్తించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలయ్య అన్నారు.
బాలయ్య తీరుపై కొమరవోలు గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తల్లిగారి సొంత గ్రామస్తులపై బాలయ్య దురుసు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది.








