అయోధ్య (Ayodhya) లోని శ్రీరామ జన్మభూమి ఆలయ (Shri Ram Janmabhoomi Temple) ట్రస్టు (Trust) కు ఆదివారం రాత్రి బెదిరింపు (Threat) ఈ మెయిల్ (Email) కలకలం సృష్టించింది. వెంటనే భద్రతా వ్యవస్థలు అలెర్ట్ (Alert) అయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. రామాలయ భద్రతను లక్ష్యంగా చేసుకున్న ఈ మెయిల్లో సీరియస్ హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది.
వెంటనే పోలీసులు దర్యాప్తు (Police Investigation) ప్రారంభించారు. ఆ బెదిరింపు మెయిల్‌ను ఇంగ్లిష్‌లో టైప్ చేసినట్టు గుర్తించగా, దాని మూలాలు తమిళనాడు (Tamil Nadu) లోని ఓ వ్యక్తి వద్దకు దారితీస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పూర్తి వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.
ఇందుకు సంబంధించి రామాలయ ట్రస్టు లేదా భద్రతా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రామాలయ భద్రతపై గతంలో కూడా కొన్ని అలజడి ఘటనలు జరిగిన నేపధ్యంలో, తాజా బెదిరింపు భద్రతాధికారులను ఆందోళనకు గురిచేసింది.
గత ఏడాది 2024లో అయోధ్య రామాలయాన్ని సుమారు 13.5 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇది తాజ్ మహల్ (Taj Mahal) సందర్శకుల సంఖ్యను మించి ఓ కొత్త రికార్డు (New Record) గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆలయం భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి.







