ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్‌ను కుటుంబ సభ్యులు ఆదివారం లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఐసీయూకు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు.
అయోధ్య రామాలయ (Ram Mandir) ప్రధానార్చకులు సత్యేంద్ర దాస్ తన 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచారు. నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో కీలక పాత్ర పోషించారు. రామాలయ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్నారు.








