దుబాయ్ వేదిక జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. నిర్ణిత 50 ఓవర్ల మ్యాచ్‌లో మూడు బంతులు మిగిలి ఉండగానే 264 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ బెంబేలెత్తిపోయారు. ఆసిస్ బ్యాటింగ్ లైనప్‌లో స్మిత్ 73, కారీ 61 పరుగులు మినహా ఎవరూ ఆశించిన స్కోర్ చేయలేకపోయారు. ఓపెనర్ హెడ్ 39 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.
టీమిండియా బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బౌలింగ్‌తో ఆసిస్ బ్యాట్‌మెన్స్‌ను కట్టడి చేశారు. పేసర్ మహ్మద్ షమీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్లు వరుణ్, రవీంద్ర జడేజా రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేలో చెరో వికెట్ తీసుకున్నారు. టీమిండియా టార్గెట్ 265. భారత బ్యాట్‌మెన్స్ స్కోర్‌ను సునాయాసంగా చేధిస్తారా..? లేదా అనేది మరికాసేపట్లో తెలియనుంది.