ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం

ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం

క్రికెట్ అభిమానుల కోసం మరో క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా కప్ టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ మెగా టోర్నీలో ఆసియా ఖండంలోని మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ ఈసారి కూడా బరిలోకి దిగుతోంది.

తొలి మ్యాచ్, భారత్ షెడ్యూల్:
ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఈరోజు (సెప్టెంబర్ 9న) అబుదాబిలో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు జరగనుంది.

టీమిండియా తొలి మ్యాచ్: యూఏఈతో రేపు (సెప్టెంబర్ 10న) ఆడనుంది.

హై ఓల్టేజ్ మ్యాచ్: భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనుంది.

గ్రూపులు, ఫార్మాట్:
టోర్నీని ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్) గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్స్ ఫార్మాట్‌లో డిజైన్ చేసింది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు:

గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్

గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్

ఈ టోర్నీ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment