భారత క్రికెట్‌లో చిరస్మరణీయమైన విజయాలను అందించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఆటకు ముగింపు చెప్పేందుకు అశ్విన్ మరికొన్ని రోజులు ఆగి సొంత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అతనిలో ఆవేదన, బాధ కనిపించాయని.. అతని మనసులో ఏం జరిగిందో వినాలని ఉందని కపిల్ తెలిపారు. బ్యాటర్లకు ఎక్కువ కీర్తి దక్కే క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ సత్తా చాటి 100కు పైగా టెస్టులు ఆడిన గొప్ప స్పిన్నర్ అని కొనియాడారు. అలాంటి ఆటగాడికి BCCI ఘనమైన వీడ్కోలు అందించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.