టీడీపీకి అశోక్ గజపతి రాజు గుడ్‌బై!

టీడీపీకి అశోక్ గజపతి రాజు గుడ్‌బై!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చాలా కాలంగా సేవలందించిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) పార్టీకి రాజీనామా (Resigned) చేశారు. ఆయన తాజాగా టీడీపీ సభ్యత్వం (TDP Membership) తో పాటు, పార్టీ పొలిట్‌బ్యూరో (Party Politburo) పదవికి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ ప‌ద‌వుల నుంచి గ‌జ‌ప‌తిరాజు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలోకి వెళ్ల‌నున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Government) అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌ (Goa Governor)గా నియమించడంతో, ఆయన రాజకీయ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ పదవిని చేపట్టనున్న నేపథ్యంలో ఆయన రాజకీయ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. గ‌జ‌ప‌తిరాజు గవర్నర్ పదవిలోనూ ప్రజాసేవ కొనసాగిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment