‘అరబిక్ కుత్తు’ మ్యాజిక్.. 700 మిలియన్ వ్యూస్‌!

'అరబిక్ కుత్తు' మ్యాజిక్.. 700 మిలియన్ వ్యూస్‌!

బీస్ట్ సినిమాలో దళపతి విజయ్, పూజా హెగ్దే కలిసి స్టెప్పులేసిన ‘అరబిక్ కుత్తు’ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘బీస్ట్’ సినిమాలోని ఈ సాంగ్ 700 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ పాటకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అనిరుధ్ అందించిన సూపర్ హిట్ ట్యూన్స్. పాట లిరిక్స్‌ను హీరో శివకార్తికేయన్ అందించగా, ఫన్నీ బీట్స్, స్టెప్పులు అందరినీ ఉర్రూతలూగించాయి.

విజయ్ ఎనర్జిటిక్ డాన్స్, పూజా హెగ్దే గ్లామర్ మేజర్ హైలైట్‌గా నిలిచాయి. అయితే, ఈ సాంగ్ సక్సెస్ అయితేనేమి, బీస్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ పాటకు ఇంకా యూత్‌లో డిమాండ్ ఉండటంతో మిలియన్ల వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండే ఈ సాంగ్, యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌లో పలు రికార్డులు సాధించనున్నట్లు కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment