ఆఫీస్‌లో రాసలీలలు.. ఏపీటీడీసీ అకౌంటెంట్ సస్పెండ్

ఆఫీస్‌లో రాసలీలలు.. ఏపీటీడీసీ అకౌంటెంట్ సస్పెండ్

విజయవాడ (Vijayawada)లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ కార్యాలయం (APTDC Divisional Office) ఉద్యోగి రాస‌లీల‌లు తాజాగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లు (Accountant Gangi Venkateswarlu)పై శిక్షా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాల‌యంలో రాస‌లీల‌లు న‌డిపిన ఉద్యోగిని సస్పెండ్ (Suspended) చేశారు. సోమవారం అధికారికంగా సస్పెన్షన్ ఆర్డర్ అందించనున్నారు. అంతేకాదు, ఆ సమయంలో విజయవాడ హెడ్ క్వార్టర్స్ పరిధిని ఆయన విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని ఉన్న‌తాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే.. గంగి వెంకటేశ్వర్లు కార్యాలయ విధులు ముగిసిన తర్వాత ఒక మహిళను బైక్‌పై తీసుకెళ్లి కార్యాలయంలోనే వివాహేత‌ర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది (Security Staff) వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో గంగి వెంకటేశ్వర్లు కొన్నికాలంగా ఈ విధమైన అస‌భ్య‌ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు స్పష్టమైంది. అంతేకాదు, విజయవాడ హరిత బెర్మ్ పార్క్ (Haritha Berm Park)లోని స్టాఫ్ రూమ్‌లో కూడా ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతారాహిత్యాన్ని మరోసారి బయటపెట్టింది. అధికారికంగా సస్పెన్షన్‌ విధించిన తర్వాత మరిన్ని క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment