ఐబొమ్మ రవి (Aibomma Ravi) అరెస్ట్ అయిన కేసులో సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నప్పటికీ, రవి తండ్రి (Ravi’s Father) అప్పారావు (Apparao) చేసిన విజ్ఞప్తి అందరినీ కదిలిస్తోంది. తన కొడుకు చేసింది తప్పేనని, చట్టం ప్రకారం శిక్ష అనుభవించాలని ఆయన ఒప్పుకున్నారు. అయితే, తన మనవరాలి భవిష్యత్తు గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ, రవిని స్టేషన్‌లో ఎక్కువ ఇబ్బంది పెట్టవద్దని కోరుతూ ఆయన సీపీ సజ్జనార్‌కు తాజాగా విన్నవించారు.
“నా కొడుకు తప్పు చేశాడు. వాడికి ఒక కూతురు ఉంది, ఆ మనవరాలిని తలచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది” అని అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. తన కోడలు కూడా ప్రస్తుతం తనతో మాట్లాడటం లేదని తెలిపారు.
“చట్టానికి జాలి దయ ఉండవని, తప్పు చేసిన వారంతా ఒక్కటేనని నాకు తెలుసు. అయినప్పటికీ, నా మనవరాలి కోసమైనా రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి” అని వేడుకున్నారు. ప్రస్తుతం తాను బాధపడటం తప్ప మరో అవకాశం లేదని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు.








