ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) రాజ్యసభలో వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుడు ముకు లవాస్నిక్ (Mukul Wasnik) అడిగిన ప్రశ్నకు సమాధానంగా జవాబిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం 2,388 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అందులో ఏపీలో ఒక్క ఏడాదిలోనే 530 మంది మృతిచెందిన‌ట్లుగా (Died) తెలిపారు.

మొంథా తుపాను (Cyclone MONTHA) ప్రభావంగా రాష్ట్రంలో ముగ్గురు మృతి, 4,566 ఇళ్లు దెబ్బతినడం, 610 పశువులు చనిపోవడం చోటుచేసుకున్నాయని కేంద్ర‌మంత్రి వివరించారు. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా 167 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

అత్యవసర సహాయ నిధి (SDRF) కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.1,449.60 కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో రూ.1,088 కోట్లు కేంద్ర వాటా, రూ.361.60 కోట్లు రాష్ట్ర వాటాగా ఉంటాయని చెప్పారు. అత్యవసర మరియు సహాయక కార్యక్రమాల కోసం SDRF తొలి విడతగా రూ.544 కోట్లు నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినట్లు కేంద్ర‌మంత్రి నిత్యానంద్ రాయ్ (Minister Nityanand Rai) వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment