ఏపీలో కానిస్టేబుల్ అసభ్యకర నృత్యం.. వీడియో వైరల్

ఏపీలో కానిస్టేబుల్ అసభ్యకర నృత్యం.. వీడియో వైరల్

కృష్ణా జిల్లా (Krishna District)లో పోలీస్ వ్యవస్థ (Police System) ప్రతిష్టను దెబ్బతీసే ఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. కంకిపాడు పోలీస్‌స్టేషన్‌ (Kankipadu Police Station)కు చెందిన ఓ కానిస్టేబుల్‌ (Constable) మహిళతో కలిసి అసభ్యకర నృత్యాలు (Obscene Dances) చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నపిల్లల సమక్షంలోనే అతడు అత్యంత నీచంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఇలా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.

వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి దర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పోలీసులు శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత వహించాల్సి ఉండగా, ఇటువంటి సంఘటనలు ఆ శాఖ‌ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ (Andhra Pradesh Police Department) ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత వివాదాస్పదమైంది.

కేంద్ర స‌ర్వేలో చిట్ట‌చివ‌ర‌న ఏపీ పోలీసు శాఖ‌
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే రిపోర్టులో ఏపీ పోలీస్ శాఖ పనితీరు దేశంలోనే అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాల అమలులో వైఫల్యం, చట్టనికి సంబంధించిన విభాగాల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మొత్తం 100 మార్కుల్లో ఏపీకి కేవలం 16.70 పాయింట్లు మాత్రమే రావడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై పెద్ద ప్రశ్నార్ధకాన్ని ఉంచింది.

రాజకీయ కక్షసాధింపులు, వ్యవస్థ దుర్వినియోగం, సమర్థవంతమైన పర్యవేక్షణ లోపం కారణంగా పోలీసులు సేవామార్గం నుండి దూరమవుతున్నారని నిపుణుల అభిప్రాయం. ఇటువంటి సమయంలో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన మరోసారి పోలీస్‌ వ్యవస్థలో క్రమశిక్షణ లోపాల్ని బహిర్గతం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment