కొత్తగా మ‌రో మూడు జిల్లాలు.. జ‌గ‌న్ మార్క్‌ను తుడిచే ప్ర‌య‌త్న‌మా..?

కొత్తగా మ‌రో మూడు జిల్లాలు.. జ‌గ‌న్ మార్క్‌ను తుడిచే ప్ర‌య‌త్న‌మా..?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) జిల్లాల పునర్వ్యవస్థీకరణ (Reorganization) ప్రక్రియలో మ‌రో అడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా మూడు (Newly Three) జిల్లాల (Districts) ఏర్పాటుకు ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆమోదం తెలిపారు. మార్కాపురం (Markapuram), మదనపల్లె (Madanapalle)తో పాటు రంపచోడవరం (Rampachodavaram) కేంద్రంగా కొత్తగా పోలవరం (Polavaram) జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను సీఎం సమీక్షించి తుది ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కూడా సీఎం అంగీకరించారు.

అయితే ప్ర‌భుత్వ తాజా చ‌ర్య‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎవరిది విజన్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2014లో 13 జిల్లాల‌తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను 2019లో అధికారంలోకి వ‌చ్చిన‌ వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) 26 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతూ పరిపాలనా సౌలభ్యాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విభ‌జిత ఏపీలోని 13 జిల్లాలకు ఒక్కటి కూడా అద‌నంగా జోడించ‌లేద‌ని, జ‌గ‌న్(Jagan) చేసిన 26 జిల్లాల్లో అభ్యంత‌రాలు తెచ్చి కొత్త‌గా మ‌రో 3 జిల్లాలు చేయ‌డం పొలిటిక‌ల్ ప‌బ్లిసిటీ స్టంట్‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పటికే జగన్ తెచ్చిన అమ్మ ఒడి, రైతు భరోసా, గ్రామ,వార్డు సచివాలయాలకు పేర్ల మార్పుతో తమ మానస పుత్రికలుగా ఖాతాల్లో వేసుకుంటున్న వారికి.. 3 జిల్లాలను అదనంగా చేసి ఈ ఘనత అంతా తమదే అని ప్రచారం చేసుకున్నా, ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కొత్త జిల్లాల పేరుతో 13ను 26 జిల్లాలుగా మార్చిన జ‌గ‌న్ మార్క్‌ను తుడిచే ప్ర‌య‌త్నంలో భాగంగా ఇలా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు సైతం వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment