ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా

ఏపీలో పేపర్ లీక్ కలకలం.. పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం లీక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శ్న‌ప‌త్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

పరీక్ష వాయిదా..
ఈ లీకేజీ కారణంగా 6-10 తరగతుల విద్యార్థులకు జరగాల్సిన సమ్మేటివ్ అసెస్మెంట్-1 మ్యాథ్స్ పరీక్షను ఈనెల 20కి పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. అయితే, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

పోలీసుల చర్యలు
క్వ‌శ్చ‌న్‌ పేపర్ లీక్ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన వ్యక్తులను గుర్తించేందుకు ద‌ర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ఫిర్యాదుతో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.

ఈ ఘటన విద్యారంగంలో పరిపాలనా లోపాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. లీకేజీ పునరావృతం కాకుండా అధికారులు తీసుకునే చర్యలు ఇప్పుడే కీలకంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment