కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై నమోదు చేసిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడాది కాలంగా జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఆదేశాలతో ఉపశమనం లభించింది.
ఏడాది తర్వాత ఉపశమనం..
గతేడాది ఏప్రిల్ 25వ తేదీన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రాజ్ కేసిరెడ్డిని ఏ1గా చేర్చి అధికారులు అరెస్ట్ చేశారు.









‘కమ్మని పాలనలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా’ – ఆదినారాయణరెడ్డి సంచలనం