హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ మహిళ (Woman)తో వివాహేతర (Extramarital) సంబంధం (Relationship) పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐఏఎస్(IAS) అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో, సీఎం పేషీలో కూడా విధులు నిర్వర్తించిన ఈ అధికారి, కొన్నేళ్లుగా ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆమె ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఐఏఎస్ అధికారి మహిళను గోడకు తోసేయగా, ఆమె తలకు తీవ్ర గాయం అవడంతో అధిక రక్తస్రావం జరిగింది. తట్టుకోలేక ఆ మహిళ మరణించింది.
ఈ ఘటనను దాచిపెట్టేందుకు తన ప్రభావం వాడుకున్న ఐఏఎస్ అధికారి, ఆసుపత్రి రికార్డుల్లో “మెట్లపై నుండి జారి పడిపోయింది” అని నమోదు చేయించినట్లు సమాచారం. ఘటన అనంతరం ఏమి జరగనట్టుగా విజయవాడ తిరిగి వెళ్లి విధులు నిర్వహిస్తున్న ఆయనపై తోటి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేగింది.








