5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

5వ‌ తేదీ వచ్చినా ఉద్యోగుల‌కు జీతాలు లేవు.. వైసీపీ ట్వీట్ వైరల్‌

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. న‌వంబ‌ర్ నెల మొద‌లై ఇప్ప‌టికే 5వ తేదీ దాటినా పలు శాఖల ఉద్యోగులకు జీతాలు పడకపోవడం తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, కలెక్టరేట్ వంటి ముఖ్య శాఖలతో పాటు ట్రెజరీ, ఐ అండ్ పీఆర్‌, పే అండ్ అకౌంట్స్‌ విభాగాల సిబ్బందికీ ఇప్పటివరకు జీతాలు జమ కాలేదని సమాచారం.

ఇక, జీతాలు బిల్లులు తయారు చేసే ట్రెజరీ ఉద్యోగులకే జీతాలు రాకపోవడం మరింత విమర్శలకు కారణమైంది. మరోవైపు, నిన్న రాత్రి పోలీసులు, మెడికల్‌, సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించినట్లు సమాచారం. ప్రభుత్వానికి నిధుల కొరత కారణంగా అప్పు తెచ్చి జీతాలు చెల్లించిన పరిస్థితి నెలకొన్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. వైసీపీ అధికారిక ట్విట్టర్ (X) అకౌంట్‌లో “ఒకటో తేదీ జీతాల హామీ కూడా తుస్‌..! ఐదో తేదీ వచ్చింది, ఇంకా జీతాల్లేవు” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ నెట్టింట్లో విస్తృతంగా వైరల్‌ అవుతోంది.

ఉద్యోగులు మరోవైపు “ముందు రోజుల్లో వైసీపీ ప్రభుత్వం నెల మొదటి తేదీన జీతాలు ఇచ్చేది, ఇప్పుడు మాత్రం అప్పు తెచ్చి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. ముఖ్యంగా, టీచర్లకు రోడ్డెక్కుతారన్న భయంతో ముందుగానే జీతాలు చెల్లించి, మిగతా శాఖలను నిర్లక్ష్యం చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల చెల్లింపు విష‌యంలో కూట‌మి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment