ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రేషన్ (Ration) విధానంలో మార్పులకు సిద్ధమవుతోంది. రేషన్ బియ్యం (Ration Rice) బదులు నగదు (Cash) లేదా నిత్యావసర వస్తువులు (Essential Commodities) అందించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరకుల పంపిణీని పునరుద్ధరించిన కూటమి సర్కార్, రేషన్ వద్దనుకునే వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నగదు లేదా సరకులు అందజేయాలని యోచిస్తోంది.
సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోనసీమ పర్యటనలో (Konaseema Tour) ఈ ప్రకటన చేశారు. ఈ విధానం అక్రమ బియ్యం రవాణాను అరికట్టడంతో పాటు ప్రజలకు సౌలభ్యం కల్పిస్తుందని భావిస్తున్నారు. పాండిచ్చేరి (Puducherry)తో సహా ఇతర రాష్ట్రాల్లో అమలైన ఇలాంటి పథకాలను అధ్యయనం చేస్తున్న అధికారులు, కేంద్ర సబ్సిడీల ప్రభావంపైనా దృష్టి సారించారు.
ఎక్కువైన అక్రమ రవాణా
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చు అని భావించినా.. పీడీఎస్ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. వాహనాల పంపిణీ కంటే ఇప్పుడే బియ్యంఅక్రమ రవాణా దందా ఎక్కువైందని ప్రజలు అంటున్నారు. గత నాలుగు రోజులుగా బియ్యం విపరీతంగా పట్టుబడినట్లు తాజాగా పత్రికల్లో వెలువడుతున్న పత్రికా కథనాలే చెబుతున్నాయి.








