ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ నిర్వహించనున్న మీడియా సమావేశం కీలకంగా మారింది. ప్రెస్‌మీట్‌లో ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ పై మాట్లాడనున్నట్లు సమాచారం. బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా వైఎస్ జగన్ స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాసనమండలిలో అధికార పక్షాన్ని ప్రశ్నలతో ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, నేడు వైఎస్ జగన్ నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌పై ఆంధ్రరాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్