‘ఏపీ ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఫేక్‌ వివరణ’ – జర్నలిస్ట్ స్ట్రాంగ్‌ కౌంటర్‌

'ఏపీ ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఫేక్‌ వివరణ' - జర్నలిస్ట్ స్ట్రాంగ్‌ కౌంటర్‌

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి అనుకూల జ‌ర్న‌లిస్ట్‌  (Journalist)గా ముద్ర‌ప‌డి, గ‌తంలో త‌న బుక్ ఆవిష్క‌ర‌ణ‌కు చంద్ర‌బాబు (Chandrababu)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించిన‌ కందుల‌ రమేష్(Ramesh) తాజాగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూసమీకరణ (Amaravati  Land Pooling)పై సిఆర్డీఏ (CRDA)  ఇచ్చిన వివరణను “ఫ్యాక్ట్ చెక్‌” (Fact Check) పేరుతో ప్రచురించిన ప్రభుత్వ ప్రకటనపై స్వతంత్ర జర్నలిస్టు కందుల రమేష్‌ (Kandula Ramesh) తీవ్రంగా స్పందించారు. తాను చేసిన వీడియోలో ఏ అంశం తప్పో చెప్పకుండా “మిస్లీడింగ్‌” (Misleading) అని ముద్ర వేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను లేవనెత్తిన విషయాలను తప్పు అని నిరూపించకుండానే, తన వ్యాఖ్యలనే వాస్తవాలుగా పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించిందని రమేష్‌ అన్నారు.

“నేను త‌ప్పు చెప్పింది ఎక్క‌డ‌?”
కందుల ర‌మేష్‌ తన వీడియోలో అమరావతిలోని ఓ వృద్ధురాలు శేషగిరమ్మ గాథ‌ను వివరించారు. ఆమె 5 సెంట్ల భూమిలో నివసిస్తుండగా, సిఆర్డీఏ భూసమీకరణ కింద ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుందని, అయితే బదులుగా స్థలం గాని, ఇల్లు గాని ఇవ్వకపోవడంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ “Misleading” అని ముద్ర వేసి కందుల పోస్టుపై వివరణ ఇచ్చింది.

కానీ ఆ వివరణలో కూడా అదే విషయాలు ఉన్నాయని, భూమిని తీసుకున్నామని, బదులుగా టిడిఆర్ బాండ్లు ఇస్తామని ప్రభుత్వమే అంగీకరించిందని రమేష్‌ చెప్పారు. “అయితే నేను తప్పు చెప్పింది ఎక్కడ?” అని ఆయన ప్రశ్నించారు. “5 సెంట్ల ఇంటి స్థలానికి టిడిఆర్ బాండ్లు ఇస్తే ఆ వృద్ధురాలు వాటితో ఏం చేసుకుంటుంది?” అని ఆయన వ్యాఖ్యానించారు.

“0.05 సెంట్లు అంటే 2.42 గజాలా?”
కందుల రమేష్‌ మరో ముఖ్య అంశాన్ని కూడా లేవనెత్తారు. “సిఆర్డీఏ ఇచ్చిన వివరణలో శేషగిరమ్మ వద్ద నుంచి తీసుకున్న భూమి 0.05 సెంట్లు అని రాశారు. కానీ 0.05 సెంట్లు అంటే 21 అడుగులు, అంటే 2.42 గజాలు మాత్రమే అవుతుంది. వాస్తవంగా ఆమె భూమి 242 గజాలు. ఇంత పెద్ద తప్పు చేసి, ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో ఇచ్చిన వివరణలో రాయడం సిఆర్డీఏ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అని ఆయన అన్నారు.

“ఫ్యాక్ట్ చెక్‌ కాదు, ఫ్యాక్ట్‌ మిస్మేనేజ్‌మెంట్‌”
“ఆమె కోర్టుకు వెళ్లిన విషయం కూడా వాస్తవమే. దీనికి సంబంధించి ఇంగ్లీషు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయినా సిఆర్డీఏ అధికారులు దానిని కూడా తిప్పికొట్టారు. ఈ వివరణలో ఉన్న ప్రతి వాక్యం ప్రభుత్వం అవగాహన లేకుండా రాసినట్టు ఉంది” అని రమేష్‌ పేర్కొన్నారు.

“మొత్తానికి, నిబంధనల ముసుగులో పేద ప్రజలతో అన్యాయం చేసి, ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో బుకాయిస్తామన్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యాక్ట్ చెక్‌ అనేది ప్రజలకు అవగాహన కలిగించే వేదిక కావాలి, కానీ ఇప్పుడు అది అధికారుల కవరింగ్‌ షీల్డ్‌గా మారిపోయింది” అని కందుల రమేష్‌ విమర్శించారు.

కందుల రమేష్‌ తన వీడియోలో చెప్పిన అంశాలను ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్‌ పేరుతో తిరిగి అంగీకరించిందని ఆరోపించారు. వృద్ధురాలి భూమి విషయంలో సిఆర్డీఏ వివరణలో స్పష్టమైన తప్పులు ఉన్నాయని, పేదలతో అన్యాయం జరుగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment