‘కూట‌మి’కి త‌ల‌నొప్పిగా జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌

'కూట‌మి'కి త‌ల‌నొప్పిగా జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌

జిల్లాల పునర్విభజన (Districts Reorganization) అంటూ కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) హ‌డావిడి చేస్తుండ‌గా, తెరపైకి వస్తున్న కొత్త డిమాండ్లు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మార‌బోతున్నాయి. 13 జిల్లా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని గ‌త వైసీపీ(YSRCP) ప్ర‌భుత్వం (Government)లో 26 జిల్లాలుగా మార్చారు మాజీ (Former) సీఎం(CM) వైఎస్ జ‌గ‌న్‌(YS Jagan). అప్ప‌ట్లో ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రణ‌, గ‌డువు, అర్జీల ప‌రిశీల‌న వంటి నిబంధ‌న‌ల‌న్నీ పాటించిన అనంత‌రం 26 జిల్లాలు ఏర్ప‌డ్డాయి. అందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌, న‌టుడు ఎన్టీఆర్ వంటి ప్ర‌ముఖ‌ల పేర్ల‌ను ఆయా జిల్లాల‌కు నామ‌క‌ర‌ణం చేశారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చిన‌ట్లుగా టీడీపీ(TDP) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్(NTR) పుట్టిన నిమ్మ‌కూరు గ్రామం ఉన్న జిల్లాకు ఆయ‌న పేరు పెట్ట‌డం అప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక జిల్లాల పున‌ర్విభ‌జ‌న హ‌డావిడి మొద‌లు పెట్టింది. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతుండ‌గా, ఆదివారం విజ‌య‌వాడ‌ (Vijayawada)లో కాపు ఐక్య వేదిక‌, బీసీ ఐక్యవేదిక, సోషల్ జస్టిస్ ఫోరం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సోషల్ జస్టిస్ ఫోరం స్టేట్ కన్వీనర్ రావి శ్రీనివాస్ (Ravi Srinivas) మాట్లాడుతూ.. జిల్లాల పునఃర్విభజనలో కొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లు మొద‌ల‌య్యాయి.

శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు, గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా పేరు, బాపట్ల జిల్లాకి బి.పి. మండల్ బాపట్ల జిల్లాగా పేరు, పల్నాడు జిల్లాకు కన్నెగంటి హనుమంతు పేరు, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు, అనంతపురం జిల్లాకు శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. తాము ప్రతిపాదించిన విధంగా పేర్లు పెట్టాలని సీఎం , డిప్యూటీ సీఎంలకు లేఖలు రాశామ‌ని, న్యాయబద్ధమైన మా డిమాండ్లను పరిష్కరించకపోతే న్యాయపోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment