డీఏ జీవోలో గందరగోళం – ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

డీఏ జీవోలో గందరగోళం – ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) తాజాగా విడుదల చేసిన డీఏ(DA) (డియర్‌నెస్ అలవెన్స్) జీవోలు (GOs – Government Orders)60, 61లపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు (Employees), ఉపాధ్యాయ సంఘాలు (Teachers Unions) తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఈ జీవోలలో తప్పుదోవ పట్టించే అంశాలు, చర్చలో ప్రస్తావించని నిర్ణయాలు చేర్చడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రులు ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో లేని అంశాలు జీవోల్లో ఉండడంపై వారు మండిప‌డుతున్నారు.

ఇంత గందరగోళ జీవో ఎప్పుడూ చూడలేదు
జీవోల్లో పేర్కొన్న షరతులు ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. డీఏ ద్వారా వచ్చే అరియర్స్‌ను ఉద్యోగ విరమణ తర్వాతే చెల్లిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “ఇలాంటి గందరగోళ జీవోను గతంలో ఎన్నడూ చూడలేదు. ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేసే ప్రయత్నం ఇది” అని సంఘాలు ఆరోపించాయి.

సీపీఎస్ ఉద్యోగులు పట్ల నిర్లక్ష్యం
జీవోల్లో సీపీఎస్ (Contributory Pension Scheme) ఉద్యోగులను ఎక్కడా ప్రస్తావించకపోవడం మరో కీలక అంశంగా మారింది. ఈ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులు తమ హక్కు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు డీఏలు ఇవ్వాల్సింది.. ఒకటే
ఉద్యోగ సంఘాల లేఖ‌ల‌ ప్రకారం, ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలలో కేవలం ఒక డీఏనే విడుదల చేసి, దానిపై కూడా ఇంత గందరగోళం సృష్టించడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం, అవమానం అని వారు పేర్కొన్నారు. “ప్రభుత్వం ఇప్పటికైనా జిఓ 60, 61లను సవరిస్తూ, ఉద్యోగుల డీఏ అరియర్స్‌ను పీఎఫ్ ఖాతాలకు, సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా నగదుగా చెల్లించాలి” అని స్పష్టంగా డిమాండ్ చేశారు.

తక్షణ చర్యలు తీసుకోవాలంటూ లేఖలు
ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత మంత్రులకు లేఖలు రాశాయి. చర్చల సమయంలో చెప్పినదానికంటే భిన్నమైన అంశాలను జీవోల్లో చేర్చడం సరైంది కాదని, ప్రభుత్వం తక్షణమే సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభిస్తామని హెచ్చరించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment