---Advertisement---

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..
---Advertisement---

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోద‌ముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై మంత్రిమండ‌లి స‌మావేశంలో చ‌ర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టాల‌ని కేబినెట్ భేటీలో నిర్ణ‌యించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుపై చ‌ర్చించారు. మంత్రిమండ‌లి స‌మావేశం అనంతరం పలు రాజకీయ అంశాలపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

  • కేబినెట్‌లో చ‌ర్చించిన‌ ముఖ్యాంశాలు..
  • నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి కమిటీ. భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.
  • వైసీపీ హయాంలో దాదాపు 7లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. ఆయా భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న మంత్రుల కమిటీ
  • వచ్చే ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకు శ్రీకారం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని నిర్ణ‌యం.
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి మండ‌లి నిర్ణ‌యం. పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశం.
  • పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించాల‌ని కేఇనెట్ నిర్ణ‌యం. రాజధాని పనులు కూడా వెంటనే ప్రారంభించాల‌ని చ‌ర్చ‌.
  • కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతి.
  • గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై చర్చ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చ.
  • ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
  • నాగావళి నదిపై గౌతు లచ్చన్న, తోటపల్లి బ్యారేజీపై కుడి, ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.
  • కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2,595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్.
  • అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment