ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ (Legislative Assembly) ఆవరణలోనే దొంగలు (Thieves) హల్‌చల్ సృష్టించారు. దొంగలు చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ.4 లక్షలు (Rs. 4 lakh) చోరీ చేశారు. ఇప్పుడీ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారుల జేబులు ఖాళీ చేయడంతో సంచలనం రేగింది.
టీడీపీ (TDP) ఎమ్మెల్సీ బీటీ నాయుడు (BT Naidu) జేబులో ఉన్న రూ.10,000, ఆయన గన్‌మెన్ (Gunman) వద్ద ఉన్న రూ.40,000, హైకోర్టు లాయర్ (High Court Lawyer) వద్ద ఉన్న రూ.50,000, మరో వ్యక్తి వద్ద ఉన్న రూ.32,000 దొంగలు అపహరించారని తెలుస్తోంది. మొత్తం రూ.4 లక్షల వరకు చోరీ జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా, అసెంబ్లీ భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన భద్రతా ప్రాంతంలో ఇలా చోరీలు జరగడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.