ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  అసెంబ్లీ (Assembly) వర్షాకాల సమావేశాలు (Rainy Season Meetings) ప్రారంభమయ్యాయి. ఉభ‌య స‌భ‌లు ప్ర‌శ్నోత్త‌రాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సమావేశాలకు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

టీడీపీ(TDP) ఇప్పటికే 20కి పైగా అంశాలపై చర్చ జరపాలని ప్రతిపాదించింది. వీటిలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల సవరణలు, ఏపీ మోటారు వాహనాల పన్నులు, సూపర్‌ 6 పథకాలతో పాటు పీ4 ప్రణాళిక, రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి కీలక అంశాలు ఉన్నాయి.

ఇక ప్రశ్నోత్తరాల సందర్భంగా సౌర విద్యుదుత్పత్తి అంశం చర్చనీయాంశమైంది. సౌర, పవన విద్యుత్ పాలసీలో లోపాలు ఉన్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. రియల్ టైమ్ లో సరఫరా నిబంధన కారణంగా పరిశ్రమలకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై మంత్రి గొట్టిపాటి స్పందిస్తూ, అవసరమైన సవరణలు చేస్తామని, ఏపీఈఆర్సీ కమిటీ నియామక ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని సమాధానం ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment