నేటి నుంచి ‘ప‌ది’ ప‌రీక్ష‌లు.. విద్యార్థులకు కీలక సూచ‌న‌లు

నేటి నుంచి ఏపీలో ప‌ది ప‌రీక్ష‌లు.. విద్యార్థులకు కీలక సూచ‌న‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప‌రీక్ష‌లు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ప్రశ్నపత్రం చదివేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,450 పరీక్షా కేంద్రాల్లో 6.19 లక్షల మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌నున్నారు.

విద్యార్థులకు ముఖ్యమైన ఏర్పాట్లు
ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాల పరిధిలో 100 మీటర్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నెట్ మ‌రియు జిరాక్స్ సెంటర్లు మూసివేతకు విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. రంజాన్ పండగ సందర్భంలో మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్షలో మార్పు అవకాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు 08662974540 కంట్రోల్ రూమ్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఎగ్జామ్ సెంట‌ర్ల‌లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మొబైల్ ఫోన్లు అనుమతి లేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment