దేశ ద్రోహిగా ప్ర‌క‌టించాలి – నా అన్వేష‌ణ‌పై వ‌రుస ఫిర్యాదులు

దేశ ద్రోహిగా ప్ర‌క‌టించాలి - నా అన్వేష‌ణ‌పై వ‌రుస ఫిర్యాదులు

ప్రపంచ యాత్రికుడిగా, “చవక.. చవక” అనే మాటతో విస్తృత గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్ (YouTuber) అన్వేష్‌ (Anvesh)కు మరోసారి భారీ షాక్ తగిలింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దూషించాడన్న ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో అన్వేష్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. మరోవైపు, అన్వేష్‌ను దేశద్రోహిగా (Anti-National) ప్రకటించి భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు (Hindu Organizations) డిమాండ్ చేస్తున్నాయి.

‘నా అన్వేషణ’ (Na Anveshana) అనే యూట్యూబ్ ఛానల్‌, సోషల్ మీడియా పేజీల ద్వారా అన్వేష్ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా వరుస ఫిర్యాదులు నమోదవుతున్నాయి. హిందూ దేవతలను దూషించాడంటూ సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అన్వేష్‌పై 352, 79, 299 సెక్షన్లు (BNS)తో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అన్వేష్‌కు నోటీసులు జారీ చేస్తామని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.

మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ (Actor Shivaji) చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అన్వేష్ వరుస వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో హిందూ దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియాలోనూ నెటిజన్లు అన్వేష్‌పై మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ వివాదాల ప్రభావం అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా ‘నా అన్వేష్ యూట్యూబ్’ ఛానల్ నుంచి లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు అన్‌సబ్‌స్క్రైబ్ చేసినట్లు తెలుస్తోంది. విమర్శలు పెరగడంతో అన్వేష్ మరో వీడియోలో తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈ కేసు ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment