సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! అనుష్క vs రష్మిక!

సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! అనుష్క vs రష్మిక!

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka) Shetty)కి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌లు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమెకు లభిస్తున్నాయి. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుకున్న అనుష్క ముందు, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక మందన (Rashmika) నిలబడుతుందా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అనుష్క వర్సెస్ రష్మిక: ఒకేరోజు రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు!

అనుష్క హీరోయిన్‌గా క్రిష్(Krish) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఘాటీ’. మోస్ట్ వయోలెంట్, రస్టిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా పోస్టర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. వాస్తవానికి ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా, సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇదే రోజున రష్మిక మందన నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే, బాక్సాఫీస్ వద్ద అనుష్క వర్సెస్ రష్మిక వార్ తప్పదన్నమాట.

అంచనాలు, ఫాలోయింగ్: ఎవరిది పైచేయి?

అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా అనేదే పెద్ద సందేహం. ఎందుకంటే రెండూ లేడీ లీడ్ సినిమాలే. ‘ది గర్ల్ ఫ్రెండ్’ రష్మిక నుంచి వస్తున్న మొదటి ఫీమేల్ లీడ్ సినిమా. కానీ అనుష్కకు యువతలో, ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులున్నారు. పైగా, క్రిష్ దర్శకత్వం, ‘ఘాటీ’ సినిమా పోస్టర్లు అంచనాలను భారీగా పెంచాయి. కథ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

మరోవైపు, రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ గురించి పెద్దగా టాక్ వినిపించట్లేదు. ఒకవేళ ఈ మూవీ కోసం వెళ్లినా, అది రష్మిక కోసమే తప్ప, సినిమాలో ఏదో గొప్పగా ఉందని ఆశించి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. మరి అనుష్క ముందు రష్మిక ఎంతవరకు నిలదొక్కుకుంటుందో సెప్టెంబర్ 5న చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment