కథనార్ ఫస్ట్ లుక్: అనుష్క పాత్రపై పెరిగిన అంచనాలు

కథనార్ ఫస్ట్ లుక్: అనుష్క పాత్రపై పెరిగిన అంచనాలు

మలయాళ (Malayalam) సినిమా పరిశ్రమలో రాబోతున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ (‘Kathanar: The Wild Sorcerer) తో టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) అరంగేట్రం చేయబోతోంది. రోజిన్ థామస్ (Rojin Thomas) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు జయసూర్య (Jayasurya) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

జయసూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో జయసూర్య గంభీరమైన చూపుతో, పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించారు. తొమ్మిదో శతాబ్దపు మాంత్రికుడు కథనార్ పాత్రలో ఆయన నటిస్తున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. “మీ సమయాన్ని, మీ మనస్సును, మీ వాస్తవికతను దొంగిలించేవాడు” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ ఈ పోస్టర్‌కు మరింత హైప్ పెంచింది.

ప్రస్తుతం ఘాతీ అనే చిత్రంలో గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్న అనుష్క, ‘కథనార్’ లో కూడా అదే తరహాలో మరో కఠినమైన, గ్రామీణ పాత్రను పోషిస్తుందా అని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. జయసూర్య ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అనుష్క పాత్రపై అంచనాలు మరింత పెరిగాయి. అభిమానులు ఇప్పుడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment