ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit)పై రోజుకో క్రేజీ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో అనుష్క శెట్టి (Anushka Shetty)(స్వీటీ) కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ప్రభాస్ సినిమాలో స్వీటీ (Sweety) నటించనుండడంతో అభిమానులలో ఉత్సాహం నెలకొంది.
ప్రభాస్-అనుష్క జోడీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే కాంబినేషన్. ఇప్పుడు ఆ పెయిర్ మళ్లీ ‘స్పిరిట్’ ద్వారా తెరపై కన్పించనున్నదనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లు (Three Heroines) ఉండనున్నారని సమాచారం. అందులో ఒకరి పాత్రకు అనుష్కను తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.