”మీది మీరు…..” – అనురాగ్ కశ్యప్ బూతు కౌంట‌ర్‌

''మీది మీరు..**'' - అనురాగ్ కశ్యప్ బూతు కౌంట‌ర్‌

బాలీవుడ్ (Bollywood) దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ (Anurag Kashyap)పై ఇటీవల ‘సినిమాలు వదిలేస్తున్నాడు (Quitting Films)’ అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై తానే స్వయంగా స్పందిస్తూ కుండ బద్దలు కొట్టాడు. “నేను ఫిల్మ్ మేకింగ్‌ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కంటే బిజీగా ఉన్నా. 2028 వరకూ నా డేట్స్ ఫుల్. ప్రస్తుతం ఐదు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే అవి రిలీజ్ అవుతాయి” అని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా, తనపై చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలపై (False Rumors) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “నిరాశతో ఇండస్ట్రీని (Industry) వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీదిమీరు…” అంటూ అసభ్య పదజాలంతో (Abusive Language) ట్వీట్ (Tweet) చేసి షాకిచ్చారు. అనురాగ్ తనదైన శైలిలో, ఆయనను పక్కదారి పట్టిస్తున్న వార్తలకు గట్టి కౌంటర్ (Strong Counter) ఇచ్చినట్టు చెబుతున్నారు అభిమానులు.

Join WhatsApp

Join Now

Leave a Comment