అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర రోడ్డు (Horrific Road) ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) టెంపో ట్రావెలర్ (Tempo Traveller)ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన చోట రహదారి మొత్తం రక్తంతో గడిసిపోయింది. ఈ ప్రమాదం కురబలకోట (Kurabalakota) మండలం దొమ్మన బావి (Dommana Bavi) సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. కర్ణాటక (Karnataka)లోని బాగేపల్లి (Bagepalli)కి చెందిన మూడు కుటుంబాలు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం టెంపో ట్రావెలర్‌లో స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా, గుర్తు తెలియని లారీ వారి వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
ప్రమాదం ఉదయం 3 గంటల సమయంలో జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని వెంటనే మదనపల్లి (Madanapalle) ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించారు. వీరిలో ఐదుగురు విషమ పరిస్థితిలో ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఎస్‌వీఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్ణాటకలోని బాగేపల్లికి చెందినవారుగా గుర్తించారు. అయితే మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
మదనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.







