విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) (AU)లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాన గేటు వద్ద విద్యార్థుల ఆందోళనతో ఏయూలో వాతావరణం వేడెక్కింది. యూనివర్సిటీలో బీఈడీ (B.Ed) చదువుతున్న విద్యార్థి (Student) మణికంఠ (Manikantha) ఈ ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందాడు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడమే అతని మరణానికి కారణమని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన బాటపట్టారు.
“డౌన్ డౌన్ వీసీ” (Down Down VC) అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఏయూ అధికారులను గట్టిగా నిలదీశారు. విశ్వవిద్యాలయం (University)లో కనీసం ఆక్సిజన్ (Oxygen) సదుపాయం కూడా లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు విద్యార్థులను నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, విద్యార్థులు వీసీని చుట్టుముట్టి ప్రశ్నలు వేశారు. ఘటనతో ఏయూ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనగా, భారీగా పోలీసులు మొహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్విగ్న పరిస్థితి కొనసాగుతోంది.
ఏయూలో వైద్య సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. అంబులెన్సులో ఆక్సిజన్ అందించి ఉంటే మణికంఠ బ్రతికేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయూ డిస్పెన్సరీలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో ఏయూ వీసీ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రేకింగ్..
— Telugu Feed (@Telugufeedsite) September 25, 2025
విశాఖలో ఏయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోళన
ఉదయం అస్వస్థతకు గురై మృతిచెందిన బీఈడీ విద్యార్ధి మణికంఠ
ఏయూలో సరైన వైద్య సదుపాయాలు లేక చనిపోయాడని ఆరోపిస్తున్న విద్యార్థులు
డౌన్.. డౌన్ వీసీ అంటూ నినాదాలు pic.twitter.com/JEXIWSc6TH








