ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ కేసు (Liquor Case)లో ఒకేరోజు వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న వైసీపీ(YSRCP) ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)కి మధ్యంతర బెయిల్(Bail) మంజూరైన నేపథ్యంలో, అదే కేసులో మరో ముగ్గురికి కూడా రెగ్యులర్ బెయిల్(Regular Bail) లభించింది. విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు(ACB Court) ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy), కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa)లకు బెయిల్ మంజూరు చేసింది. మే 14న అరెస్టైన బాలాజీ గోవిందప్ప, మే 16న అరెస్టైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ కేసులో రిమాండ్‌లో ఉన్నారు.
కోర్టు షరతుల ప్రకారం, ఒక్కొక్కరు రూ.1 లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలి. అదనంగా, ముగ్గురు తమ పాస్‌పోర్టులను కోర్టులో జమ చేయాలి. మిథున్‌రెడ్డి విడుదలైన కొద్ది సేపటికే ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరవ్వడం, ఒకేరోజు నలుగురు కీలక వ్యక్తుల విడుదలకు అవకాశం రావడం వైసీపీ శ్రేణులకు ఊరట కలిగించే పరిణామంగా మారింది.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్