ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి (Legislative Council) చివరి రోజు (Last Day) సభ (Session)లో ఆరు కీలక బిల్లులకు ఆమోదం (Approval) తెలిపింది. చర్చ అనంతరం ఆమోదం పొందిన ఈ బిల్లులు చట్టరూపం దాల్చనున్నాయి. దీంతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పన్నులు తదితర విభాగాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ముఖ్యంగా అమరావతి (Amaravati)లో న్యాయవిద్య, పరిశోధన కోసం భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు 2025 బిల్లు మండలిలో ఆమోదం పొందింది. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ చట్టం 2025, ఏపీ వర్సిటీల సవరణ బిల్లు 2025లకు కూడా ఆమోదం లభించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు “కుష్టు వ్యాధి” అనే పదాన్ని తొలగించేందుకు చేసిన చట్ట సవరణను కూడా మండలి ఆమోదించింది.
ఇక వ్యవసాయేతర ప్రయోజనాల కోసం 2006లో అమల్లోకి వచ్చిన ఏపీ వ్యవసాయ భూమి చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకువచ్చిన బిల్లుకు కూడా ఆమోదం లభించింది. ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాలు, వేతన సరళీకరణ బిల్లు 2025ను మండలి ఆమోదించగా, క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ప్రత్యేక చట్టసవరణను ఆమోదించారు. అదనంగా ఏపీ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు 2025 కూడా మండలిలో ఆమోదం పొందింది. ఆమోదం అనంతరం మండలి వాయిదా పడింది.







