ఏపీ(AP) కాంగ్రెస్ పార్టీ (Congress Party’s)కి కొత్త చీఫ్ (New Chief) రాబోతున్నారా..? ప్రస్తుత అధ్యక్షరాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) తీరుతో క్యాడర్ (Cadre) అసంతృప్తిగా ఉందా..? ఆమె ప్లేస్‌లో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారా..? అనే ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా మరోసారి మహిళకే అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మహిళా నాయకురాలి పేరు బలంగా వినిపిస్తోంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)కు చెందిన కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) కిల్లి కృపారాణి (Killi Krupa Rani) ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ (AP PCC Chief) పదవి రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఊపందుకుంది. 2004లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ఈమెకు తొలిసారిగా ఎంపీగా టికెట్ ఇచ్చారు వైఎస్సార్. అయితే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినా, 2009లో మాత్రం కాంగ్రెస్ తరఫున మళ్లీ పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి (K. Yerran Naidu)పై విజయం సాధించారు.ఆమె ఘనవిజయం సాధించారు. ఆ విజయం ఆమెకు సంచలనంగా మారింది.
2019కి ముందు వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఆమె కొంతకాలం తరువాత వైసీపీలో చేరినా.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి వెళ్లిపోయారు. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కృపారాణి, డాక్టర్ గా ఉన్నత విద్యావంతురాలు. బీసీల్లో కాంగ్రెస్‌కి బలమైన నాయకురాలిగా పేరొందిన ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ పునరుజ్జీవనాన్ని ఆశించవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
అయితే ప్రస్తుత అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటాలు, పార్టీ పటిష్టతకు కార్యాచరణ చేయకుండా, వ్యక్తిగత అంశాలను రాజకీయాలకు ముడిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై నిత్యం విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ క్యాడర్‌కు నచ్చడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్షలు, కమిటీలపై రివ్యూలు చేయడం లేదని ఇప్పటికే కొందరు ఏపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో జెండా మోసేందుకు కొత్తవారెవరూ రాని కాంగ్రెస్‌కు కృపారాణి నాయకత్వం సరైన ఎంపిక అవుతుందా..? అనే చర్చ ప్రారంభమైంది.







