ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ (YCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Shyamala) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘తనకు పరిపాలన చేసే సత్తా లేదని ఒక పెద్ద మనిషి చెబుతున్నారని’’ వ్యాఖ్యానిస్తూ పవన్‌పై స్ట్రాంగ్ సెటైర్లు (Strong Remarks) వేశారు. రాజమండ్రి కిమ్స్ (Rajahmundry KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని, కుటుంబ సభ్యులను వైసీపీ మహిళా నేతలు, మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margarani Bharat) పరామర్శించారు. బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు (Chandrababu), హోంమంత్రి అనిత (Anitha) తీసుకెళ్లే చిన్న పని కూడా పవన్ చేయలేకపోయారా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్యామల, వరుడు కళ్యాణి (Varudu Kalyani) ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణమైన దీపక్ (Deepak)పై కఠిన చర్యలు తీసుకోవాలని, సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను బయట పెట్టాలని కోరారు. అంజలి (Anjali) విషయంలో అనుమానాలు ఉన్నాయని, ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఆమె తానే తీసుకుందా లేక ఎవరైనా ఇచ్చారా అన్నదానిపై స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళా భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుందని, సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రశ్నించారు. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. ప్రతి గంటకు ముగ్గురు మహిళలు అఘాయిత్యానికి గురవుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం (Coalition Government)లో మహిళలకు రక్షణ లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.








