నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో నిలిచారు. హిందూ మతం(Hinduism), సనాతన ధర్మానికి(Sanatana Dharma) సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ(BJP) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లోని(Hyderabad) బోరబండ పోలీస్ స్టేషన్‌లో(Borabanda Police Station) ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ‘జై శ్రీరామ్’(Jai Shri Ram) నినాదాన్ని ప్రస్తావిస్తూ అనసూయ చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు తనపై వచ్చిన విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు సగం సగం ఎడిట్ చేసి వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఏ మతం, కులం లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, ఆంజనేయ స్వామి (Lord Hanuman) భక్తురాలినని పేర్కొంటూ.. తన వ్యాఖ్యలు హిందూ మతానికి వ్యతిరేకం కాదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ ‘జై శ్రీరామ్’(Jai Shri Ram), ‘జై హనుమాన్’(Jai Hanuman) అంటూ తన స్పందనను ముగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండటంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.








