తమిళనాడులో అమిత్‌ షా రూల్‌ చెల్లదు.. – స్టాలిన్‌

తమిళనాడులో అమిత్‌ షా రూల్‌ చెల్లదు.. - స్టాలిన్‌

Summarize with AI

తమిళనాడు (Tamil Nadu) లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah)పై డీఎంకే చీఫ్‌ (DMK Chief), ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M.K. Stalin) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. “అమిత్‌ షా రూల్‌ (Rule) తమిళనాడులో పని చేయదు (Won’t Work). విభజించు పాలించు సిద్ధాంతం ఇక్కడ అమలుకాకపోతే మంచిది. తమిళనాడు ఎప్పుడూ ఢిల్లీ (Delhi) కి వందనాలు చేసేది కాదు” అంటూ స్టాలిన్‌ ఊహించని స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం మద్దతుతో తీసుకొచ్చిన నీట్‌ (NEET) పరీక్ష, జాతీయ విద్యా విధానం (NEP)పై తమిళనాడు ప్రభుత్వం కాఠినంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇక తమిళనాడు రాజకీయాల్లో ఇటీవలే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) మళ్లీ బీజేపీ (BJP) తో చేతులు కలపడం, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు పెంచుతోంది. స్టాలిన్‌ వ్యాఖ్యలు ఈ పొత్తుపై నేరుగా స్పందించినట్టుగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment