---Advertisement---

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు
---Advertisement---

తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తారుమారు చేస్తోందని, ఇది పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. “అంబేద్క‌ర్‌ను కలలో కూడా అవమానించే ఆలోచన మా సిద్ధాంతానికి అనుకూలం కాదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. అంబేద్క‌ర్‌కు భారతరత్న ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీజేపీ మద్దతుతోనే ఆయనకు మరణానంతరం భారతరత్న లభించిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను గౌరవించలేదని, బీజేపీ ప్రభుత్వమే ఆయనకు గౌర‌వం ఇచ్చింద‌న్నారు.

ఎమర్జెన్సీ నుంచి..
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తూ, గతంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించిందని విమర్శించారు. రాజ్యసభ రికార్డుల్లో త‌న ప్రసంగం స్పష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ తన పాత అల‌వాట్ల‌ను కొనసాగిస్తూ వాస్తవాలను వక్రీకరించడంలో నిమగ్నమైందన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment