బ్రోకర్ రాజకీయాలు చేసినందుకు బీఆర్ నాయుడి (B.R. Naidu)కి చంద్రబాబు (Chandrababu) టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాడని, పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో ఉండి బీఆర్ నాయుడు తప్పుడు కూతలు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని సంపాధించుకున్న టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు ఒక మచ్చలా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ సీఎం వైఎస్ జగన్(YS.Jagan), ఆయన సతీమణి భారతీరెడ్డి (Bharati Reddy)పై బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు అంబటి (Ambati) కౌంటర్ ఇచ్చారు.
టీవీ5 ఛానల్ రేటింగ్ కోసం బీఆర్ నాయుడు అర్ధరాత్రి మిడ్ నైట్ (Midnight) మసాలా (Masala) షో(Show)లు నడిపించిన దుర్మార్గుడు అని, బట్ట తలమీద వెంట్రుకలు మొలిపిస్తామని న్యూజెన్ ఆయిల్ అమ్మి అమాయకులను మోసం చేశాడని, ఇప్పుడు కొత్తగా రంగు నీళ్లు కలిపి ఆర్థో ఆయిల్స్ పేరుతో ప్రజలను వంచిస్తున్నాడని మండిపడ్డారు. నీతిమాలిన పనులు చేసే బీఆర్ నాయుడును పవిత్రమైన స్థానం కూర్చోబెట్టినందుకు చంద్రబాబుకు పాపం తగులుతుందన్నారు. మిడ్‌నైట్ మాసాలా షోలు నడిపిన బీఆర్ నాయుడు హిందుత్వం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు.
అటవీ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించేంత శక్తి హోంమంత్రి అనితకు ఉందా..? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇటువంటి వాటిని పట్టించుకోకుండా అమరావతి మునిగిందని అన్న ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాలని ఆదేశిస్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కొత్తగా వేసిన బైపాస్‌కు గండి కొట్టి, మరీ వరదనీటిని వదిలితే తప్ప అమరావతిలో వరద బయటకు పోలేదు. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. తన శాఖ సిబ్బందిపై దాడి జరిగితే మంత్రి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారని, అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే, ఆయన కనీసం స్పందిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల గురించి మాట్లాడే ఆయనకు తన శాఖలోని సిబ్బందిపై జరిగిన దాడి పట్టదా? అని ప్రశ్నించారు.