ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన పిల్లలు అర్హ, అయాన్‌కు సంబంధించిన అందమైన మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆమె షేర్ చేసిన ఓ డాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అర్హ, అయాన్ స్టెప్పులు..
స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్కూల్‌కు సంబంధించిన ఈవెంట్‌లో అర్హ, అయాన్ తమ క్లాస్‌మెట్స్‌తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో పిల్లల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. వీరి డాన్స్ చూసిన నెటిజన్లు “అల్లు అర్జున్ వారసులు కూడా డాన్స్‌లో అదుర్స్”, “టాలెంట్ వారి ఇంట్లోనే ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియోపై విపరీతంగా రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.








