సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ప్రారంభానికి ముందే భారీ పారితోషికం తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2: ది రూల్’ విషయంలో పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపిన మొత్తం బిజినెస్‌లో దాదాపు 27 నుంచి 30 శాతం వరకు వాటాను తన రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరిగింది. ప్రీ-రిలీజ్ దశలోనే ‘పుష్ప-2’ బిజినెస్ రూ. 1000 కోట్లకు పైగా జరగడంతో, బన్నీ ఆదాయం రూ. 270 నుంచి రూ. 300 కోట్ల వరకు చేరినట్లు సమాచారం. ఇది భారతీయ సినీ చరిత్రలోనే ఒక హీరోకి దక్కిన అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలవడం విశేషం.
ఈ విజయంతో అల్లు అర్జున్ అదే ఫార్ములాను తన తదుపరి చిత్రాలకు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ (AA22)ను సన్ పిక్చర్స్ దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు బన్నీకి రూ. 175 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 15 శాతం వాటా ఇచ్చేలా డీల్ కుదిరినట్లు టాక్. సినిమా సక్సెస్ అయితే ఆయన ఆదాయం రూ. 300 కోట్లను దాటే ఛాన్స్ ఉంది. ఇదే తరహాలో లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే తదుపరి చిత్రం (AA23)కూ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బిజినెస్ షేరింగ్ ఒప్పందం చేసుకున్నారట. సినిమా రిస్క్‌లో భాగస్వామిగా మారుతూ, సక్సెస్‌ను షేర్ చేసుకునే ఈ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన అల్లు అర్జున్… ఇప్పుడు ఇతర స్టార్ హీరోలకు కూడా ఇన్‌స్పిరేషన్‌గా మారుతున్నాడు.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్