అల్లు అర్జున్ సినిమాలో రష్మికా మందన్నా.. ప్రతినాయిక పాత్రలోనా?

అల్లు అర్జున్ సినిమాలో రష్మికా మందన్నా.. ప్రతినాయిక పాత్రలోనా?

‘పుష్ప’ (Pushpa) సిరీస్ (Series) తర్వాత హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరియు రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి కలిసి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనున్నారనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కథ ప్రకారం ఐదుగురు హీరోయిన్లు (Five Heroines) ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఇప్పటికే దీపికా పదుకోన్‌  (Deepika Padukone)  ఒక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో మరో హీరోయిన్‌ మృణాల్‌ ఠాగూర్‌ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మిగిలిన ముగ్గురు హీరోయిన్‌ పాత్రల కోసం రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా ఎఫ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రష్మికా మందన్నా మరియు జాన్వీ కపూర్ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్ర గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఆమెది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదని, ప్రతినాయిక ఛాయలున్న పాత్ర అని తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా రష్మిక కనిపించనున్నారని, ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment