అల్లు అర్జున్ కొత్త లుక్.. అభిమానులు షాక్

అల్లు అర్జున్ కొత్త లుక్.. అభిమానులు షాక్

Summarize with AI

ఐకాన్ స్టార్‌ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా సినిమాకి త‌న లుక్‌ను మార్చుతూ, అభిమానుల‌ను (Fans) ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌ (Surprise) లో ముంచెత్తుతాడు. పుష్ప‌-2 త‌రువాత కాస్త రిలాక్స్ అవుతున్న బ‌న్నీ.. కొత్త సినిమాకు రెడీ అవుతున్న‌ట్లుగా క‌నిపించారు. త‌న కొత్త లుక్‌ (New look)తో అభిమానుల మనసు దోచుకున్నారు.

కొంతకాలంగా ‘పుష్ప’ సినిమాలో గడ్డంతోనే కనిపిస్తున్న బన్నీ, తాజాగా గడ్డం లేకుండా (Clean-Shaven) సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. తన భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హతో కలిసి ఓ కుటుంబ వివాహ వేడుకకు హాజరైన అల్లు అర్జున్, లేత గోధుమరంగు కుర్తా, నలుపు ప్యాంటుతో క్లాస్‌గా స్టైల్ (Classy Style) కొట్టారు. ఈ లుక్‌లో ఆయన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అల్లు అర్జున్ గతంలో ‘పుష్ప’ సినిమా కోసం మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా క్లాస్ అండ్ క్లీన్ లుక్‌తో కొత్తగా కనిపిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ “ఇది అదే బన్నీనా?” అనే సందేహమే రాకమానదు.

Join WhatsApp

Join Now

Leave a Comment