అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. సన్ పిక్చర్స్ (Sun Pictures) పతాకంపై కళానిధి మారన్ (Kalanithi Maran) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone)ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, మృణాల్ ఠాగూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా హీరోయిన్లుగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబై (Mumbai)లో జరిగే ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌లోనే ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే, ఈ తొలి షెడ్యూల్ షూటింగ్‌లో దీపికా పదుకొణెపాల్గొనరని తెలిసింది.
అంతేకాకుండా, ఈ సినిమా కోసం అట్లీ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, అందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







