కామెడీ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లోకి వస్తున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
ఇంద్రలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనక పాత్రలు భూమిపైకి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన, ఫాంటసీ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ అప్సరసల పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషా సింగ్ అందంగా కనిపించగా, దేవలోకాధిపతి ఇంద్రుడిగా వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.
హీరో అల్లరి నరేష్ తన కూల్ అండ్ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, చిలిపి చేష్టలతో పూర్తిగా అలరించారు. ముఖ్యంగా ట్రెండింగ్ డైలాగ్స్, కొన్ని సినిమాల మేనిరిజమ్స్‌ని అనుకరిస్తూ నరేష్ చేసే కామెడీ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లలో నవ్విస్తాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే అల్లరి నరేష్ మరోసారి తన బలామైన స్వచ్ఛమైన హాస్యంతో ప్రేక్షకులకు పక్కా నవ్వుల విందు ఇవ్వబోతున్నట్లు స్పష్టమవుతోంది.








