తెలుగు సినీ నటుడు అలీ (Ali) గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన రాజమండ్రి (Rajahmundry)కి చెందిన వారని, చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తితో చెన్నై (Chennai) వెళ్లి నటుడిగా మారారని చాలామంది భావిస్తారు. అయితే, అలీ పూర్వీకులది బర్మా (Burma) (ప్రస్తుతం మయన్మార్) అని, ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా నుంచి భారత్‌కు
నిజానికి, అలీ నానమ్మ, తాత, అలీ తండ్రితో పాటు, నానమ్మ తమ్ముడు – మొత్తం నలుగురు కలిసి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక ఓడలో బర్మా నుంచి బయలుదేరి భారతదేశానికి(India) చేరుకున్నారట. వారు రాజమండ్రికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత కేవలం ఈ ఒక్క కుటుంబమే వృద్ధి చెంది, ప్రస్తుతం వెయ్యి మందికి పైగా బంధువులు ఉన్నట్లు అలీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలీ నటుడిగా వందలాది సినిమాలు చేయడమే కాకుండా, కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. అలాగే, కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా. ఆయన తెలుగువారే అయినా, ఆయన కుటుంబ మూలాలు బర్మాతో ముడిపడి ఉండటం ఆసక్తికరమైన విషయం.