650 కుటుంబాలకు అక్షయ్ కుమార్ ఆశ్రయం

650 కుటుంబాలకు అక్షయ్ కుమార్ ఆశ్రయం

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సినిమా ఇండస్ట్రీ (Cinema Industry)లో అత్యంత ప్రమాదభరితంగా పనిచేసే స్టంట్‌మాస్టర్లు (Stunt Masters), స్టంట్ కార్మికుల (Stunt Workers) కోసం ఆయన ముందడుగు వేశారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న 650 మంది (Peoples) స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమా (Health Insurance) ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.

ఇటీవల తమిళనాడు (Tamil Nadu)లో దర్శకుడు పా. రంజిత్ (Pa. Ranjith) తెరకెక్కిస్తున్న వేట్టువం సినిమాలో స్టంట్ చేస్తుండగా స్టంట్ మాస్టర్ రాజు (Raju) (52) హృదయ ఆఘాతంతో మృతి చెందారు. ఈ ఘటన అక్షయ్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ వార్త విని చాలా బాధపడ్డానని, దీని తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.

స్టంట్ల కోసం ప్రాణాలతో ఆట
“స్టంట్ వర్కర్లు సినిమాల్లో అత్యంత రిస్క్‌ తీసుకుని పని చేస్తారు. ఒక్క తప్పు జరిగితే వారి జీవితం గడచిపోయినట్లే. రిస్క్ తీసుకుంటున్నా… వారికి ఉద్యోగ భద్రత లేదు, రెమ్యునరేషన్ తక్కువే, ఆరోగ్య బీమా ఉండదు. ఈ పరిస్థితుల్లో వారికి ఎంతైన సాయం చేయాలి,” అని అక్షయ్ అన్నారు.

బీమాతో పాటు ప్రమాద పరిరక్షణ
అక్షయ్ కుమార్ ప్రకటించిన ఈ ఆరోగ్య బీమా ప్లాన్ కేవలం సాధారణ మెడికల్ కవరేజ్‌కే కాకుండా, ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే కుటుంబానికి నష్ట పరిహారం కూడా అందించనుంది. ఈ ప్రకటనతో సినీ ఇండస్ట్రీలో ఆయన్ను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా అక్షయ్‌ను “రియల్ హీరో”(Real Hero)గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇంతకు ముందు కూడా కార్గిల్ యోధుల కుటుంబాలకు, కరోనా సమయంలో సహాయ నిధులకు భారీ విరాళాలు అందజేసిన అక్షయ్… మళ్లీ తన మానవతా విలువలు చాటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment