ఆసియా కప్ 2025లో దాయాది పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోవడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అక్తర్ మాట్లాడుతూ.. “భారత్ ఆడిన తీరు అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టూ ఇండియా” అని ప్రశంసించారు. అయితే, మ్యాచ్ తర్వాత జరిగిన సంఘటన తనను నిరాశపరిచిందని చెప్పారు. “క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టవద్దు. ఆటగాళ్లు మైదానంలో స్నేహపూర్వకంగా ఉండాలి. పాకిస్తాన్ ఆటగాళ్ళు షేక్‌హ్యాండ్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, భారత ఆటగాళ్లు వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం బాధాకరం” అని అక్తర్ అన్నారు.
“పహల్గామ్ దాడులు, ఇతర రాజకీయ సమస్యలను పక్కన పెట్టి ముందుకు సాగాలి. ఇది కేవలం ఒక ఆట. ఇతర జట్ల ఆటగాళ్లతో చేతులు కలపండి, మీ గొప్పతనాన్ని చూపించండి” అని అక్తర్ సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల అభిమానులలో మిశ్రమ స్పందనను కలిగించాయి.